తిరుపతిలో ట్యూనా ఫిష్‌

ABN , First Publish Date - 2021-03-22T07:40:42+05:30 IST

తిరుపతి అన్నారావు సర్కిల్లో ‘ది మీట్‌ ఫ్యాక్టరీ’ పేరుతో నూతనంగా ఏర్పాటైన మాంసాహార దుకాణంలో ఆదివారం అరుదైన ట్యూనా ఫిష్‌ కనిపించింది.

తిరుపతిలో ట్యూనా ఫిష్‌
ట్యూనా ఫిష్‌

తిరుపతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అన్నారావు సర్కిల్లో ‘ది మీట్‌ ఫ్యాక్టరీ’ పేరుతో నూతనంగా ఏర్పాటైన మాంసాహార దుకాణంలో ఆదివారం అరుదైన ట్యూనా ఫిష్‌ కనిపించింది. కిలో రూ.500 చొప్పున విక్రయించగా.. కొనుగోలుకు సీ ఫుడ్‌ ప్రియులు పోటీపడ్డారు. ఈ దుకాణ యజమాని అయిన సతీష్‌.. అరుదైన సీ ఫుడ్‌ను తిరుపతివాసులకు పరిచయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో కాకినాడ తీరంలో జాలరి వలకు చిక్కిన 75 కిలోల ట్యూనా చేపను రూ.20వేలకు వేలం పాడి.. నగరానికి తీసుకొచ్చారు. అధిక పోషక విలువలు కలిగిన ట్యూనా చేపను నగరాల్లోని పెద్ద పెద్ద స్టార్‌ హోటళ్లకు, విదేశాలకు ఎగుమతి చేస్తారని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-03-22T07:40:42+05:30 IST