టీటీడీ హోంగార్డు ఇంట్లో దొంగతనం
ABN , First Publish Date - 2021-09-03T06:44:08+05:30 IST
టీటీడీ విజిలెన్స్ హోంగార్డు మురళీమోహన్ ఇంట్లో చోరీ జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఈయన ఎర్రమిట్టలో కాపురం ఉంటున్నారు.

20గ్రాముల బంగారు, రూ.10వేల నగదు చోరీ
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 2: టీటీడీ విజిలెన్స్ హోంగార్డు మురళీమోహన్ ఇంట్లో చోరీ జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఈయన ఎర్రమిట్టలో కాపురం ఉంటున్నారు. గతనెల 31వ తేది మురళీమోహన్ నైట్‌డ్యూటీకి వెళ్లగా.. ఆయన భార్య అదే ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. ఒకటో తేది ఉదయం డ్యూటీ నుంచి ఇంటికి ఆయన ఇంటికిరాగా.. తలుపుల తాళాలు పగులగొట్టి కనిపించాయి. ఇంట్లో వస్తువులు చిందరవందర చేసి ఉండటంతోపాటు బీరువాలో 20 గ్రాముల బంగారు నగలు, రూ.10వేల నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన ఆయన అలిపిరి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో పరిశీలించిన అలిపిరి ఎస్‌ఐ మోహన్‌కుమార్ గౌడ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.