‘గో మహా సమ్మేళనం’పై టీటీడీ ఈవో సమీక్ష

ABN , First Publish Date - 2021-10-14T05:46:21+05:30 IST

గోసంరక్షణ, గోఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈనెల 30, 31వ తేదీల్లో గోమహా సమ్మేళనం తిరుపతిలో నిర్వహించనున్నారు.

‘గో మహా సమ్మేళనం’పై టీటీడీ ఈవో సమీక్ష
సమావేశంలో ప్రసంగిస్తున్న జవహర్‌రెడ్డి

తిరుమల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గోసంరక్షణ, గోఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈనెల 30, 31వ తేదీల్లో గోమహా సమ్మేళనం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కార్యక్రమ నిర్వహణకు ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియం లేదా మహతి అడిటోరియాన్ని పరిశీలించి, ఒకదానిని ఎంపిక చేయాలన్నారు. దక్షిణాదితోపాటు ఉత్తరాది నుంచి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వస్తున్నారని తెలిపారు. ఈ సమ్మేళనంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ తొలిరోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు హాజరవుతారని చెప్పారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం రిసెప్షన్‌, రవాణా, ఫుడ్‌, అకామిడేషన్‌, తదితర కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, సీఈ నాగేశ్వరరావు, యుగ తులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌, గోశాల సంచాలకుడు హరనాథ్‌రెడ్డి, ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్‌, రమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-14T05:46:21+05:30 IST