ఎస్వీయూ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ?

ABN , First Publish Date - 2021-03-22T07:43:50+05:30 IST

ఎస్వీయూలో ఆందోళనలకు దారితీసిన పీజీ అడ్మిషన్ల వ్యవహారాన్ని ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు.

ఎస్వీయూ  వ్యవహారంపై త్రిసభ్య కమిటీ?

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 21: ఎస్వీయూలో ఆందోళనలకు దారితీసిన పీజీ అడ్మిషన్ల వ్యవహారాన్ని ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు.ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నారాయణరెడ్డి, డీవోఏ విభాగం మాజీ డైరెక్టర్‌ సీహెచ్‌ అప్పారావు, డీవోఏ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ దేవప్రసాదరాజులతో  దీనిపై విచారణకు  కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.వీసీ రాజారెడ్డి సోమవారం వర్సిటీకి వచ్చాక, కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు వెలువరించే అవకాశాలున్నాయి.ఆ వెంటనే కమిటీ విచారణకు దిగనుంది. అడ్మిషన్ల వ్యవహారం వివాదాస్పదం కావడంతో సీజ్‌ చేసిన డీవోఏ కార్యాలయాన్ని కూడా కమిటీ పరిశీలించనుంది. విద్యార్థి సంఘాల ఆరోపణలపై సంబంధిత రికార్డులను కూడా పరిశీలిస్తారు.కాగా వైసీపీ విద్యార్థి సంఘానికి చెందిన గ్రూపుల మధ్య ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీవోఏ అధికారులతోపాటు విద్యార్థి సంఘ నేతలతో ఓ ఉన్నతాధికారి సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.అడ్మిషన్ల వ్యవహారంపై ప్రభుత్వం కూడా ఆరా తీసినట్లు సమాచారం. పత్రికల్లో వచ్చిన వార్తలతోపాటు విద్యార్థి సంఘాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా తమకు వివరణ ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులను ఉన్నత విద్యామండలి అధికారులు కోరినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-03-22T07:43:50+05:30 IST