39 మంది ఎస్‌ఐల బదిలీలు

ABN , First Publish Date - 2021-07-12T06:34:49+05:30 IST

జిల్లాలో 39 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్‌పీ సెంథిల్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

39 మంది ఎస్‌ఐల బదిలీలు

చిత్తూరు, జూలై 11: జిల్లాలో 39 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్‌పీ సెంథిల్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వీఆర్‌లో ఉన్న 28 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా 11 మందిని బదిలీ చేశారు. బదిలీ అయిన ఎస్‌ఐలు ఒకట్రెండు రోజుల్లో కేటాయించిన స్టేషన్లలో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐలకు కేటాయించిన స్టేషన్లు... అనిల్‌కుమార్‌(చిత్తూరు వన్‌టౌన్‌), షేక్షావలి(చిత్తూరు టూటౌన్‌), మనోహర్‌(పూతలపట్టు) నాగార్జునరెడ్డి(కేవీబీపురం) సుబ్బారెడ్డి(పలమనేరు అర్బన్‌), ప్రవీణ్‌కుమార్‌(శ్రీసిటీ హైటెక్‌స్టేషన్‌), ఉమామహేశ్వర్‌రెడ్డి(కుప్పం అర్బన్‌), వెంకటశివకుమార్‌(రామకుప్పం), రవికుమార్‌(చౌడేపల్లె), చంద్రమోహన్‌(మదనపల్లె టూటౌన్‌), రామ్మోహన్‌(బి.కొత్తకోట), వెంకటేశ్వర్లు(వాయల్పాడు), పరశురాముడు(చిత్తూరు వన్‌టౌన్‌) మనోహర్‌(చిత్తూరు ఎస్‌బీ), రామకృష్ణ(పాకాల), రవి(చిత్తూరు సీసీఎస్‌), సోమశేఖర్‌(మదనపల్లె తాలూకా), వెంకట నరసింహులు(సీసీఎస్‌ చిత్తూరు), సుభాన్‌ నాయక్‌(మదనపల్లె ట్రాఫిక్‌), గుండాల్‌ నాయక్‌(మదనపల్లె పీసీఆర్‌), రవీంద్రనాథ్‌(శ్రీసిటీలోని ఎస్‌సీ, ఎస్టీసెల్‌-2) నారాయణప్పను పీలేరు ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. అలాగే తిప్పయ్య, భాస్కర ప్రసాదరాజు, గౌష్‌పిరా, వెంకటరమణ, సాయినాథ్‌ ప్రసాద్‌లను అనంతపురానికి బదిలీ చేశారు. అదేవిధంగా బంగారుపాళ్యంలో ఉన్న రామకృష్ణయ్యను చిత్తూరు తాలూకా స్టేషన్‌కు, చిత్తూరు ట్రాఫిక్‌లో ఉన్న నరేష్‌ను నగరి అర్బన్‌కు, మదనపల్లె తాలూకా స్టేషన్‌లో ఉన్న దిలీప్‌ కుమార్‌ను చిత్తూరు ఎస్‌బీకి,  చిత్తూరు ఎస్‌బీలో ఉన్న రాంభూపాల్‌ను వీకోటకు, చిత్తూరు వన్‌టౌన్‌లో ఉన్న మోహన్‌కుమార్‌ను పుంగనూరుకు, రామకుప్పంలో ఉన్న కృష్ణయ్యను చిత్తూరు ట్రాఫిక్‌కు, మదనపల్లె తాలూకా స్టేషన్‌లో ఉన్న సీహెచ్‌హెచ్‌ ప్రసాద్‌ను గుర్రంకొండకు, పూతలపట్టులో ఉన్న రాజ్‌కుమార్‌ను మదనపల్లె ట్రాఫిక్‌కు, మదనపల్లె టూ టౌన్‌లో ఉన్న బాబును చిత్తూరు సీసీఎస్‌కు, మదనపల్లె తాలూకాలో ఉన్న రమాదేవిని మదనపల్లె ట్రాఫిక్‌కు, పాకాలలో ఉన్న పుర్యా నాయక్‌ను మదనపల్లె ఎస్‌డీపీవోకుకు బదిలీ చేశారు.

Updated Date - 2021-07-12T06:34:49+05:30 IST