దారిమళ్లిన రైళ్లు

ABN , First Publish Date - 2021-12-25T05:38:41+05:30 IST

కాట్పాడి-అరక్కోణం మార్గంలో వంతెన మరమ్మతుల కారణంగా పలురైళ్లను దారి మళ్లిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దారిమళ్లిన రైళ్లు

రేణిగుంట, డిసెంబరు 24: కాట్పాడి-అరక్కోణం మార్గంలో వంతెన మరమ్మతుల కారణంగా పలురైళ్లను దారి మళ్లిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఉదయం నుంచి తిరుత్తణి, అరక్కోణం బైపాస్‌ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను రేణిగుంట, తిరుపతి, చిత్తూరు మీదుగా కాట్పాడి వైపు నడిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా శనివారం కూడా ఇదేమార్గంలో పలురైళ్లు రాకపోకలు సాగిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-12-25T05:38:41+05:30 IST