నేటినుంచి 28 వీధి దీపాల నిర్వహణపై శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2021-03-22T05:00:01+05:30 IST
జగనన్న పల్లె వెలుగు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులపై సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, డీపీవో దశరథరామిరెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్, మార్చి 21: జగనన్న పల్లె వెలుగు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులపై సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, డీపీవో దశరథరామిరెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు పంచాయతీల పరిధిలో ఉన్నాయన్నారు. ఇంత వరకు వీటి నిర్వహణ బాధ్యత ఏజెన్సీలు నిర్వహిస్తుండగా ఏప్రిల్ 1నుంచి గ్రామ సచివాలయాలకు బదిలీ చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్, ఎనర్జీ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లలో తొలి విడతలో 22, 23, 24 తేదీల్లో, రెండో విడతలో 25 నుంచి 28వ తేదీ వరకు విద్యుత్‌శాఖ అధికారులచే శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు.