జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు శిరీష ఎంపిక

ABN , First Publish Date - 2021-03-14T07:09:29+05:30 IST

జాతీయస్థాయి జూనియర్‌ ఫెన్సింగ్‌ పోటీలకు శిరీష ఎంపికైంది.

జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు శిరీష ఎంపిక
కోచ్‌లతో కలిసి కాంస్యబహుమతి చూపిస్తున్న శిరీష

రామచంద్రాపురం, మార్చి 13: జాతీయస్థాయి జూనియర్‌  ఫెన్సింగ్‌ పోటీలకు శిరీష ఎంపికైంది. మండలంలోని పుల్లమనాయుడు గ్రామానికి చెందిన చిరంజీవులనాయుడు కుమార్తె శిరీష డిగ్రిమొదటి సంవత్సరంలో చేరింది. శిరీష చిన్నప్పటి నుంచి క్రీడల్లో రాణిస్తుండడంతో తండ్రి చిరంజీవులనాయుడు  ఫెన్సింగ్‌ కోచ్‌ సయ్యద్‌సాహేబ్‌ దగ్గర శిక్షణ ఇప్పించారు. గత నెల 28న కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలో కాంస్య బహుమతి అందుకుంది. దీంతో జాతీయస్థాయి  ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపిక అయ్యింది. ఈనెల 14నుంచి ఉత్తరాఖండ్‌రాష్ట్రంలోని రుద్రపూర్‌ నగరంలో జరిగే జాతీయస్థాయి జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌  ఫెన్సింగ్‌ క్రీడలో పాల్గొననుంది. ఈ సందర్భంగా చిరంజీవులనాయుడు జిల్లా  ఫెన్సింగ్‌  సంఘం కార్యదర్శి దిలీ్‌పకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-03-14T07:09:29+05:30 IST