విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై రేపు సదస్సు
ABN , First Publish Date - 2021-10-20T07:43:42+05:30 IST
తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సదస్సు నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు.

తిరుపతి(తిలక్‌రోడ్డు), అక్టోబరు 19: తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సదస్సు నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్‌కల్లాం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ప్రముఖులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, రైతులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈసమావేశంలో పురుషోత్తంరెడ్డి, విజయలక్ష్మి, యశోద, షేక్ మహ్మద్‌రఫీ తదితరులు పాల్గొన్నారు.