టమోటా కిలో రూ.32

ABN , First Publish Date - 2021-10-20T05:15:34+05:30 IST

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వారం రోజులుగా నాణ్యమైన టమోటా కిలో రూ.50 దాకా పలుకగా, మంగళవారం ఒక్కసారిగా రూ.32కు పడిపోయింది.

టమోటా కిలో రూ.32

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 19: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వారం రోజులుగా నాణ్యమైన టమోటా కిలో రూ.50 దాకా పలుకగా, మంగళవారం ఒక్కసారిగా రూ.32కు పడిపోయింది.  వారం రోజులుగా మార్కెట్‌యార్డుకు నిత్యం 80 నుంచి 250 టన్నుల టమోటా విక్రయానికి వచ్చేది. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా టమోటా దిగుబడి పెరిగింది. దీంతో మంగళవారం మార్కెట్‌కు 300 టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది.  వ్యాపారుల మధ్య పోటి లేక మొదటి రకం టమోటా గరిష్ఠ ధర కిలో రూ.32 పలకగా, రెండో రకం   కనిష్ఠ ధర కిలో రూ.7కు పడిపోయింది.

Updated Date - 2021-10-20T05:15:34+05:30 IST