నేడు, రేపు కొవాగ్జిన్‌ రెండో డోస్‌

ABN , First Publish Date - 2021-05-18T06:14:56+05:30 IST

కొవాగ్జిన్‌ రెండో డోస్‌ను జిల్లావ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వేయనున్నట్లు సోమవారం డీఐవో హనుమంతరావు తెలిపారు.

నేడు, రేపు కొవాగ్జిన్‌ రెండో డోస్‌

టోకెన్లు ఇచ్చిన వారికే టీకా వేస్తారన్న డీఐవో


చిత్తూరు రూరల్‌, మే 17: కొవాగ్జిన్‌ రెండో డోస్‌ను జిల్లావ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వేయనున్నట్లు సోమవారం డీఐవో హనుమంతరావు తెలిపారు. అది కూడా టోకెన్లు పంపిణీ చేసిన వారికి మాత్రమే అని పేర్కొన్నారు. సుమారు 40 వ్యాక్సినేషన్‌ కేంద్రాల పరిధిలో 22,450 మందికి ఇప్పటికే టోకెన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వీరికి మాత్రమే రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేనివారు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. వచ్చినా టీకా వేయరన్నారు.

Updated Date - 2021-05-18T06:14:56+05:30 IST