నేడు ఎస్వీ వేదవర్సిటీ స్నాతకోత్సవం
ABN , First Publish Date - 2021-10-28T06:41:10+05:30 IST
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలం ఆరో స్నాతకోత్సవం గురువారం ఉదయం 11.30గంటలకు ఆవర్సిటీ ప్రాంగణంలోని యాగశాలలో జరగనుంది.

తిరుపతి(విద్య), అక్టోబరు 27: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలం ఆరో స్నాతకోత్సవం గురువారం ఉదయం 11.30గంటలకు ఆవర్సిటీ ప్రాంగణంలోని యాగశాలలో జరగనుంది. వర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్‌లో అధ్యక్షోపన్యాసం చేస్తారని టీటీడీ అధికారులు ప్రకటించారు. 2019-20లో ఉత్తీర్ణులైన 120మందికి యూజీ డిగ్రీలు, 46మందికి పీజీ డిగ్రీలు, ఇద్దరికి ఎంఫిల్, 11మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. తిరుపతికిచెందిన వేదపండితుడు బ్రహ్మశ్రీ గణేశన్‌శ్రౌతికి మహామహోపాధ్యాయ పురస్కారం అందజేస్తారు. వేద వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శనశర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.