నేడు మిలాదున్‌నబీ సెలవు

ABN , First Publish Date - 2021-10-19T06:44:46+05:30 IST

మిలాదున్‌నబీ పర్వదినం మంగళవారంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటిస్తూ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నేడు మిలాదున్‌నబీ సెలవు

కలికిరి, అక్టోబరు 18: మిలాదున్‌నబీ పర్వదినం మంగళవారంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటిస్తూ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.గతంలో బుధవారం (20వ తేదీ) మిలాదున్‌నబికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఇస్లామిక్‌ నెలలో 12వ రోజైన మంగళవారం (19వ తేదీ) నాడే యాదృచ్చికంగా మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం కలిసొచ్చిందని, కాబట్టి ఈద్‌ మిలాదున్‌నబి పర్వదినాన్ని 20వ తేదీకి బదులుగా 19వ తేదీనే జరుపుకునేందుకు అనువుగా ప్రభుత్వం ప్రకటించాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో ప్రభుత్వాన్ని కోరారు.దీంతో సోమవారం ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

Updated Date - 2021-10-19T06:44:46+05:30 IST