చావుకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు...

ABN , First Publish Date - 2021-12-28T06:13:05+05:30 IST

మండలంలోని పాలమంగళం వద్ద ముందున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. సంఘటన సోమవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది.

చావుకు వెళ్లి వస్తూ  తిరిగిరాని లోకాలకు...
మృతి చెందిన కృష్టయ్య

నారాయణవనం, డిసెంబరు 27: మండలంలోని పాలమంగళం వద్ద ముందున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. సంఘటన సోమవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది.  బాధితుల కథనం మేరకు నారాయణవనం మండలానికి చెందిన కృష్టయ్య (31), బాలచంద్ర ఇద్దరు నాగలపురంలోని బంధువుల చావుకు వెళ్లి తిరిగి వస్తుండగా పాలమంగళం వద్ద ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆపారు. దీంతో వెనుకనే వస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీని వెనుక ఢీ కొంది.  ప్రమాదంలో కృష్టయ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన బాలచంద్రను స్థానికుల సమాచారం మేరకు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.


Updated Date - 2021-12-28T06:13:05+05:30 IST