తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడే

ABN , First Publish Date - 2021-05-02T06:54:47+05:30 IST

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి.

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నేడే
తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో కౌంటింగు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అబ్జర్వర్‌ రాజేంద్ర నాయక్‌

 చిత్తూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 17వ తేదీన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మన జిల్లా పరిధిలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,65,426 ఓట్లు (62.84 శాతం) పోలయ్యాయి. వీటిని లెక్కించేందుకు 70 టేబుళ్లు, 230 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది 48 గంటల లోపు చేసుకున్న కరోనా పరీక్ష నెగటివ్‌ రిపోర్టు కలిగి ఉండాలని, లేదా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న సర్టిఫికెట్‌ ఉండాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయా సర్టిఫికెట్లను పరిశీలించి లెక్కింపు కేంద్రంలోకి అనుమతించనున్నారు.

Updated Date - 2021-05-02T06:54:47+05:30 IST