తిరుపతిలో సంచలనం రేపుతున్న జడ్జి కారు

ABN , First Publish Date - 2021-12-31T19:38:01+05:30 IST

ఉపాధి హామీ పథకంలో అంబుడ్స్‌మెన్‌గా ఉన్న నర్సారాయుడు తన కారు నెంబర్ ప్లేట్‌పై జిల్లా జడ్జిగా తాటికాయంత అక్షరాలతో రాసుకున్నారు.

తిరుపతిలో సంచలనం రేపుతున్న జడ్జి కారు

తిరుపతి: న్యాయవ్యవస్థపై గౌరవం చూపండని భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నోసార్లు చెప్పారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని కూడా హెచ్చరించారు. అయినా ఏపీలోని వైసీపీ నేతల తీరు మారడంలేదు. ఉపాధి హామీ పథకంలో అంబుడ్స్‌మెన్‌గా ఉన్న నర్సారాయుడు తన కారు నెంబర్ ప్లేట్‌పై జిల్లా జడ్జిగా తాటికాయంత అక్షరాలతో రాసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కారులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో పెట్టుకున్నారు. చూసేవారంతా జడ్జి తన కారులో పెద్దిరెడ్డి ఫోటో ఎందుకు అంత ప్రేమ, భక్తితో పెట్టుకున్నారనే సందేహిస్తున్నారు. తిరుపతి కోర్టు రోడ్డులో ఈ కారు తిరుగుతోంది. న్యాయవాదులు, కక్ష్యదారులు సయితం.. ఆ కారు ఫలానా వ్యక్తిదని తెలుసుకుని, వారి తీరుకు మండిపడుతున్నారు. దీనిపై న్యాయవ్యవస్థలోని కీలక వ్యక్తులు స్పందించాలని కోరుతున్నారు. ఈ కారు వ్యవహారం తిరుపతిలోని న్యాయవాదులనే కాకుండా మొత్తంగా అందరినీ ఆలోచింపజేస్తోంది.

Updated Date - 2021-12-31T19:38:01+05:30 IST