తిరుపతి: లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-11-05T22:00:35+05:30 IST

తిరుపతి: నగరంలోని లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది.

తిరుపతి: లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం

తిరుపతి: నగరంలోని లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న 8 వాహనాలపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కలవాళ్లు  భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-11-05T22:00:35+05:30 IST