డీసీసీబీలో నిధుల దుర్వినియోగం జరగకూడదు

ABN , First Publish Date - 2021-03-25T05:19:17+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాలని బ్యాంకు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, జేసీ మార్కొండేయులు అన్నారు. సహకార బ్యాంకుల్లో అవినీతి, నగదు దుర్వినియోగం జరిగితే రిజర్వు బ్యాంకు తీవ్రంగా పరిగణిస్తూ బ్యాకింగ్‌ కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

డీసీసీబీలో నిధుల దుర్వినియోగం జరగకూడదు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ మార్కొండేయులు

బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి, జేసీ మార్కొండేయులు


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 24: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాలని బ్యాంకు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, జేసీ మార్కొండేయులు అన్నారు. సహకార బ్యాంకుల్లో అవినీతి, నగదు దుర్వినియోగం జరిగితే రిజర్వు బ్యాంకు తీవ్రంగా పరిగణిస్తూ బ్యాకింగ్‌ కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బుధవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో బ్యాంకు సర్వభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాజకీయ జోక్యంతో సహకార బ్యాంకుల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వీర్యమైపోతున్నాయన్నారు. దీనివల్ల డిపాజిటర్లకు సహకార బ్యాంకులపై అపోహలు నెలకొన్నాయన్నారు. త్వరలో సింగిల్‌ విండోలన్నీ కంప్యూటరీకరణ చేసే ఆలోచణలో ప్రభుత్వం ఉందన్నారు. తొలుత బ్యాంకు సీఈవో మనోహర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది రూ.650 కోట్ల డిపాజిట్ల సేకరణ లక్ష్యంకాగా ఇప్పటికే రూ.640 కోట్ల సేకరణ పూర్తయిందన్నారు. ఓవర్‌ డ్యూలు ఎక్కువగా ఉన్నా బ్యాంకు లాభాల దిశగా వెళుతోందన్నారు. అనంతరం బ్యాంకు పరిపాలన నివేదికను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో డీసీవో చంద్రశేఖరరెడ్డి, ఐసీడీపీ సీఈవో రవిచంద్రన్‌, నాబార్డు డీడీఎం సునీల్‌, డీజీఎంలు శంకర్‌బాబు, లిల్లీ క్యాథరిన్‌, ఏజీఎంలు, సింగిల్‌ విండోల పర్సన్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.


సీడీసీఎంఎస్‌ను లాభాల బాటలోకి తీసుకురండి


జిల్లా సహకార మార్కెంటింగ్‌ సొసైటీ(సీడీసీఎంఎస్‌)ని లాభాల దిశగా నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ సంస్థ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, జేసీ మార్కొండేయులు సూచించారు. సీడీసీఎంఎస్‌ మహాజన సభలో ఆయన మాట్లాడుతూ కొత్త వ్యాపారాల నిర్వహణ, నూతన గోదాముల నిర్మాణానికి ఐసీడీపీ ప్రాజెక్టు ద్వారా రూ.6.60 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన నిధుల నుంచి రూ.25 లక్షలు విడుదల చేశారని చెప్పారు. సీడీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ రత్నయ్య, సీఈవో మనోహర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆధునీకరణకు రూ.6 కోట్ల రుణ ప్రతిపాదన


జిల్లా కో ఆపరేటింగ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆధునీకరణ కోసం ఐసీడీపీ ప్రాజెక్టు ద్వారా రూ.6కోట్ల రుణ విడుదల కోసం ప్రతిపాదన పంపినట్లు డీసీవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన ప్రింటింగ్‌ ప్రెస్‌ సర్వసభ్య సమావేశంలో సీఈవో మురళి మాట్లాడుతూ ఏడాదికి సగటున రూ.2 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-03-25T05:19:17+05:30 IST