కోబాకలో పురాతన అక్కగార్ల విగ్రహాల చోరీ

ABN , First Publish Date - 2021-09-19T05:36:17+05:30 IST

ఏర్పేడు మండలంలోని కోబాకలో శనివారం పురాతన అక్కగార్ల విగ్రహాల చోరీ జరిగింది.

కోబాకలో పురాతన అక్కగార్ల విగ్రహాల చోరీ
విగ్రహాల చోరీతో ఖాళీగా ఉన్న ఆలయం

ఏర్పేడు, సెప్టెంబరు 18: మండలంలోని కోబాక గ్రామంలో శనివారం పురాతన అక్కగార్ల విగ్రహాల చోరీ జరిగింది. వివరాలివీ... ఏర్పేడు మండలకేంద్రానికి కూతవేటు దూరంలో కోబాక గ్రామం ఉంది. ఇక్కడ చారిత్రక నేపథ్యమున్న పురాతన అక్కగార్ల ఆలయం ఉంది. కాగా, శనివారం సాయంత్రం ఈ మార్గంలో వెళ్తున్న పలువురు ఆలయంలోని నాలుగు అక్కగార్ల విగ్రహాలు మాయమైనట్లు గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. కాగా, ఆలయ ప్రాంతంలో తరచూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠా ఈ చోరీకి పాల్పడి ఉంటుందని కోబాక గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో ఘటనపై గ్రామస్తులు ఫోన్‌ ద్వారా ఏర్పేడు పోలీసులకు సమాచారం అందించగా, ఆదివారం ఉదయం రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. 

Updated Date - 2021-09-19T05:36:17+05:30 IST