ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసమే స్టడీ సర్కిల్‌

ABN , First Publish Date - 2021-11-09T07:36:53+05:30 IST

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే స్టడీ సర్కిల్‌ ప్రారంభించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి విశ్వరూప్‌ అన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసమే స్టడీ సర్కిల్‌
భవన శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి విశ్వరూప్‌

సాంఘిక సంక్షేమశాఖామంత్రి విశ్వరూప్‌ 


తిరుపతి(రవాణా), నవంబరు 8: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే స్టడీ సర్కిల్‌ ప్రారంభించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి విశ్వరూప్‌ అన్నారు. తిరుపతిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఏపీ స్టడీ సర్కిల్‌ నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తిరుపతి, విజయవాడ, విశాఖ నగరాల్లో స్టడీ సర్కిళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. వీటిని ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి స్టడీ సర్కిల్‌లో బ్యాంక్‌ పరీక్షలకు.. విజయవాడలో గ్రూప్‌వన్‌, టూ.. విశాఖలో సివిల్స్‌ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏ పథకాన్నీ రద్దు చేయబోమని స్పష్టం చేశారు. అనంతరం స్టడీ సర్కిల్‌లోని విద్యార్థులకు ఆయన మెటీరియల్‌ అందజేశారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీత తెలిపారు. వెబ్‌సైట్‌లో వారి వివరాలను పొందుపరిస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖాధికారులు, కార్పొరేటర్‌ నరేంద్ర, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు మధు, వైసీపీ ఎస్సీ విభాగం పార్లమెంటరీ అధ్యక్షుడు రాజేంద్ర, డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T07:36:53+05:30 IST