పీలేరును ముంచేసిన మంచు !

ABN , First Publish Date - 2021-12-31T08:17:23+05:30 IST

సూర్యోదయ వేళ మేఘం విరిగిపడినట్లు కురిసిన మంచుపొగలు పీలేరు పట్టణాన్ని ముంచేశాయి.

పీలేరును ముంచేసిన మంచు !

పీలేరు, డిసెంబరు 30: సూర్యోదయ వేళ మేఘం విరిగిపడినట్లు కురిసిన మంచుపొగలు పీలేరు పట్టణాన్ని ముంచేశాయి. రెండు గంటల పాటు దట్టమైన మంచు కమ్ముకోవడంతో రోడ్లు కూడా కనపడక వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాయి. గురువారం ఉదయం 6నుంచి 8గంటల వరకు పీలేరు పట్టణం మంచు దుప్పట్లో కశ్మీరాన్ని తలపించింది. పట్టణ శివారులో జీవనదిగా ప్రవహిస్తున్న పింఛానది మంచుపొగలతో మసకబారి చూపరులకు కనువిందు చేసింది.మొత్తానికి మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేశాయి. 

Updated Date - 2021-12-31T08:17:23+05:30 IST