17న ఏపీపీఎస్సీ భవనం ముట్టడి
ABN , First Publish Date - 2021-06-15T05:49:38+05:30 IST
గ్రూప్-1 ఇంటర్వ్యూలను నిలుపుదల చేయాలని ఈ నెల 17వ తేది విజయవాడలోని ఏపీపీఎస్సీ భవనాన్ని ముట్టడించనున్నట్టు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు చెప్పారు
తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు
మదనపల్లె టౌన్, జూన్ 14: గ్రూప్-1 ఇంటర్వ్యూలను నిలుపుదల చేయాలని ఈ నెల 17వ తేది విజయవాడలోని ఏపీపీఎస్సీ భవనాన్ని ముట్టడించనున్నట్టు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు చెప్పారు. సోమవారం టీడీపీ అధిష్ఠానం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మదనపల్లె నుంచి పాల్గొన్న శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ... గ్రూప్-1 ఫలితాల్లో నష్టపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈనెల 15న మంగళవారం అఖిలపక్షం, విద్యార్థి సంఘాలతో మదనపల్లెలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఏపీపీఎస్సీ పరీక్ష నోటిఫికేషన్, నిర్వహణ, ఇంటర్వ్యూలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. వందలాది మంది అభ్యర్థుల భవిష్యత్‌ను నాశనం చేసే ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ చేయాలని కోరారు.