పాకాల పెద్దవంకలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-09T07:02:21+05:30 IST

పాకాల పెద్దవంక ప్రవాహంలో కొట్టుకుపోయి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది.

పాకాల పెద్దవంకలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
చిట్టిబాబు మృతదేహాన్ని వెలికితీస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పాకాల, నవంబరు 8: పాకాల పెద్దవంక ప్రవాహంలో కొట్టుకుపోయి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. ఉప్పరపల్లె పంచాయతీ పచ్చిపాలఇండ్లుకు చెందిన చిట్టిబాబు(56) ఆదివారం సాయంత్రం పాకాల నుంచి ఇంటికి బయలుదేరారు. పాకాల సమీపంలో రైల్వే వంతెన క్రింద ఉధ్రుతంగా ప్రవహిస్తున్న వంకను దాటే క్రమంలో కొట్టుకు పోయాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి ఆదేశాలతో అగ్నిమాపక కేంద్రం అధికారి గుణశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వంకలో గాలించారు. రైల్వే వంతెన కింద నుంచి సుమారు కిలోమీటరు దూరంలోని వంకలో ముళ్లపొదల్లో చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గుర్తించి వెలికి తీశారు. అగ్నిమాపక సిబ్బంది కె.విశ్వనాఽథం, మాధవరాజు, పయని, గిరిబాబు, హేమకుమార్‌ కలిసి మృతదేహాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-11-09T07:02:21+05:30 IST