వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి

ABN , First Publish Date - 2021-10-19T06:50:58+05:30 IST

అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందిన సంఘటన తవణం పల్లె మండలంలో జరిగింది.

వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి
చిరుత కళేబరం

తవణంపల్లె, అక్టోబరు 18: అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందిన సంఘటన తవణం పల్లె మండలంలో జరిగింది. మడవనేరి గ్రామ సమీపంలోని చినపాపమ్మకు చెందిన పంట చేన్లో అడవి జంతువుల కోసం ఎవరో ఉచ్చులను ఏర్పాటు చేశారు. ఈ ఉచ్చులో చిక్కుకొని మూడు సంవత్సరాల వయసున్న మగ చిరుత పులి ఆదివారం రాత్రి మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో వెస్ట్‌ డీఏఫ్‌వో రవి శంకర్‌, రేంజర్‌ సుభాష్‌,ఎఫ్‌ఎస్‌వో శివరామ్‌ సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకొని చిరుత పులి కళేబరాన్ని పరిశీలించా రు.పశుసంవర్ధక శాఖ అధికారులతో పంచనామా నిర్వహించి ఖననం చేశారు.

Updated Date - 2021-10-19T06:50:58+05:30 IST