ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T06:24:04+05:30 IST
ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ దొరసాని ఆదేశించారు.

శ్రీకాళహస్తి/ఏర్పేడుజూలై 23: ఖరీఫ్ సీజనుకు సంబంధించి ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ దొరసాని ఆదేశించారు. ఏర్పేడు మండలం అంజిమేడు రైతుభరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ రైతులతో మాట్లాడుతూ.. వరి దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. పంటల బీమా సాయం అందాలంటే ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరి అని గుర్తుచేశారు. అనంతరం ఆమె శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు చేరుకుని ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం డివిజన్ వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. అగ్రిల్యాబ్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో డీడీ శివకుమార్, ఏడీలు మనోహర్, సురేంద్రరెడ్డి, ఏవోలు సుహర్‌లత, చిట్టిబాబు, భారతి, షణ్ముగం, అసిస్టెంట్ మనోహర్‌బాబు, సర్పంచ్ మోహన్‌రెడ్డి, కార్యదర్శి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.