ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై భారం తగదు: దొమ్మలపాటి

ABN , First Publish Date - 2021-12-26T05:48:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలపై భారం మోపడం తగదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు.

ఓటీఎస్‌ పేరుతో ప్రజలపై భారం తగదు: దొమ్మలపాటి
మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 25: రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలపై భారం మోపడం తగదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ... ఎన్టీఆర్‌ హయాంలో నిర్మించిన ఇళ్లకు నేడు జగన్‌ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో రూ.10 నుంచి రూ.20వేలు చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఓటీఎస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నా జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా గృహ విద్యుత్‌ వినియోగదారులపై అదనపు లోడు పేరుతో రూ.వేలల్లో చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని, అసలే కరోనా, అధిక వర్షాలతో అల్లాడుతున్న ప్రజలపై అదనపు భారం వేస్తున్నారన్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన వరి  కొనుగోలులో ఆర్‌బీకే పూర్తిగా విఫలమైందన్నారు. మేకల రెడ్డిశేఖర్‌, దేవరింటి శ్రీనివాసులు, నాగయ్య, వినోద్‌, ముక్తియార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:48:02+05:30 IST