రూ.200 దాటిన ప్రతి వస్తువుకూ బిల్లు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-09-04T05:17:12+05:30 IST

రూ.200 దాటిన ప్రతి వస్తువుకూ తప్పనిసరి బిల్లు ఇవ్వాలని వాణిజ్య పన్నులశాఖ జేసీ జాన్‌ స్టీవెన్సన్‌ స్పష్టం చేశారు.

రూ.200 దాటిన ప్రతి వస్తువుకూ బిల్లు తప్పనిసరి

కమర్షియల్‌ ట్యాక్స్‌ జేసీ జాన్‌ స్టీవెన్సన్‌


చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 3: రూ.200 దాటిన ప్రతి వస్తువుకూ తప్పనిసరి బిల్లు ఇవ్వాలని వాణిజ్య పన్నులశాఖ జేసీ జాన్‌ స్టీవెన్సన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో వ్యాపార సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు లేకుండా అక్రమ వ్యాపారాలు చేస్తే జీఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు ఇవ్వని వ్యాపారులకు రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. ఆడిట్‌ డీసీ భానుప్రకాష్‌ మాట్లాడుతూ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న వారు విధిగా జీఎస్టీ ఆర్‌-10ను ఫైలు చేయాలన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పునరుద్దరణ కోసం ఈ నెల 30 వరకు గడువు ఉందని ఏసీ హరీష్‌కుమార్‌ తెలిపారు. అలాగే నెలవారి 3బీ రిటర్నులు ఆలస్యంగా చెల్లించిన వారికి స్వల్ప అపరాధ రుసుంతో నవంబరు వరకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందన్నారు.

Updated Date - 2021-09-04T05:17:12+05:30 IST