నాల్గోవిడత జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-27T07:03:22+05:30 IST

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రారంభమయ్యాయి.

నాల్గోవిడత జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం
విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రంలోకి పంపుతున్న నిర్వాహకులు

తిరుపతి(విద్య), ఆగస్టు 26: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షకు మొదటిరోజు తిరుపతి, చిత్తూరులోని కేంద్రాల్లో 964మంది హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్‌ పి.సింధు తెలిపారు. తిరుపతిలో 1674కి 813మంది, చిత్తూరులో 264కి 151మంది హాజరైనట్లు వివరించారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్ష నిర్వహించామన్నారు. 

Updated Date - 2021-08-27T07:03:22+05:30 IST