లోకేశ్‌ను కలిసిన తెలుగుయువత నాయకులు

ABN , First Publish Date - 2021-10-14T05:32:48+05:30 IST

తంబళ్లపల్లె నియోజకవర్గా నికి చెందిన తెలుగు యువత నాయకులు టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.

లోకేశ్‌ను కలిసిన తెలుగుయువత నాయకులు
లోకేశ్‌తో తెలుగుయువత నాయకులు

కురబలకోట, అక్టోబరు 13: తంబళ్లపల్లె నియోజకవర్గా నికి చెందిన తెలుగు యువత నాయకులు టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. రాజం పేట పార్లమెంటరీ తెలుగుయువత అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో లోకేశ్‌ను హైదరాబాద్‌లో యువత నాయ కులు పి.శ్రీనాథ్‌రెడ్డి, సదర్శన్‌రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పరిస్థితులను లోకేశ్‌ అడి గి తెలుసుకున్నట్టు నవీన్‌ తెలిపారు. అలాగే పార్టీ బలో పేతానికి  కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా మని లోకేశ్‌ భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్టు నాయకులు తెలిపారు.

Updated Date - 2021-10-14T05:32:48+05:30 IST