తెలుగు ప్రజల ఆకాంక్ష అమరావతి: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-19T05:52:06+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తెలుగు ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు పార్టీలకతీతంగా, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం హర్షణీయమన్నారు.

తెలుగు ప్రజల ఆకాంక్ష అమరావతి: టీడీపీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దొరబాబు

చిత్తూరు సిటీ, డిసెంబరు 18: రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తెలుగు ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు పార్టీలకతీతంగా, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం హర్షణీయమన్నారు. సభకు వచ్చిన అందరికీ టీడీపీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. రాజధాని పూర్తయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో సీఎం జగన్‌ అమరావతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌ మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించినా ప్రజలు భారీసంఖ్యలో హాజరై విజయవతం చేశారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర బీసీసెల్‌ ఉపాధ్యక్షుడు షణ్ముగం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, విభజించు పాలించు విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి డ్వాక్రా మహిళలను తరలించడం సరికాదన్నారు. చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాద్‌ మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదలను వేధించిడం అన్యాయమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఇళ్లను ఉచితంగా రిజిష్ర్టేషన్‌ చేసి ఇస్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ నేతలు మోహన్‌రాజ్‌, అశోక్‌, మేషాక్‌, సీఎం విజయ, సుబ్రి, ఫైరోజ్‌, నవాజ్‌, అన్సర్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T05:52:06+05:30 IST