పెట్రో, గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రేపు టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-08-27T06:36:11+05:30 IST

పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరల పెంపుతోపాటు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై శనివారం టీడీపీ నిరసన చేపట్టనుంది.

పెట్రో, గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రేపు టీడీపీ నిరసన

చిత్తూరు సిటీ, ఆగస్టు 26: పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరల పెంపుతోపాటు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై శనివారం టీడీపీ నిరసన చేపట్టనుంది. ఈ మేరకు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పార్టీ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరు కావాలని సూచించారు. 

Updated Date - 2021-08-27T06:36:11+05:30 IST