పెట్రో ధరలపై కదం తొక్కిన టీడీపీ

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

పాదయాత్రలో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ మాయా జాలం చేస్తున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్య నిర్వా హక కార్యదర్శి రాటకొండ మధుబాబు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో పె ట్రోల్‌పై వ్యాట్‌ పెంచారని గగ్గోలు పెట్టిన జగన్‌ ఇ ప్పుడు తగ్గించకుండా పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఆయనకే చెల్లిందన్నారు.

పెట్రో ధరలపై కదం తొక్కిన టీడీపీ
మదనపల్లెలో పెట్రోల్‌బంకు వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన్‌, నవంబరు 9: పాదయాత్రలో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ మాయా జాలం చేస్తున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్య నిర్వా హక కార్యదర్శి రాటకొండ మధుబాబు పేర్కొన్నారు.  ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకు ఎదుట పెట్రో ధరలపై టీడీపీ నాయకుల ధర్నాలో మధు బాబు మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో  పె ట్రోల్‌పై వ్యాట్‌ పెంచారని గగ్గోలు పెట్టిన జగన్‌ ఇ ప్పుడు తగ్గించకుండా పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఆయనకే చెల్లిందన్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గిస్తే ఏపీలో మాత్రం లీటరుకు రూ.10 ఎక్కువగా ఉండడం ప్రజలకు భారం అవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భవానీప్రసాద్‌,  రెడ్డిశేఖర్‌,  శ్రీనివా సులు, బందార్ల రవి, సిద్దప్ప, శివయ్య, ఎస్‌ఎం రఫి, నాగయ్య, వి.వెంకటేష్‌, వెంకటరమణరెడ్డి, అరుణ్‌ తేజ్‌, విజయమ్మ, ఉష తదితరులు పాల్గొన్నారు.


ములకలచెరువు: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీయేనని టీడీపీ మండల అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజు, జడ్పీటీసీ  మాజీ సభ్యుడు కువైట్‌ శంకర్‌, టీడీపీ రాజంపేట పార్ల మెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి యర్రగుడి సురేష్‌ అన్నారు. స్థానిక పెట్రోల్‌ బంకు ఎదుట  పెట్రోల్‌, డీజల్‌ ధరలపై టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించినా ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలే దన్నారు. కోఆప్షన్‌ మాజీ సభ్యుడు మౌళా, రమణా రెడ్డి,  పాల రాము, గంగులప్ప, నాగమల్లప్ప, సుబ్బి నాయుడు, భాస్కర్‌రెడ్డి, వెంకటస్వామి, రామాంజులు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. 


బి.కొత్తకోట: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలంటే, సీఎం జగన్‌ దిగిపోవాలంటూ టీడీపీ నాయకులు నినా దాలు చేశారు. స్థానిక పెట్రోల్‌ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత తగ్గించినా, రాష్ట్రం దిగిరాక పోవపోవడం వి డ్డూ రమన్నారు. దీంతో జగన్‌కు ప్రజలపై ఉన్న ప్రేమ ఎ లాంటిదో అర్థం అవుతోందన్నారు. నారాయణ, కుమార్‌, కిట్టన్న, మగ్గాల రవి, నాగరాజు, రమణా రెడ్డి, శ్రీరాములు, గట్టు చంద్ర, పద్మనాభం, జి.రమణ, డి.వేమనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


కురబలకోట: అంగళ్లు సమీపంలోని పెట్రోల్‌ బంకుల వద్ద పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని  రాజంపేట పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి పెంచడం, దోచుకోవడం తప్ప, ప్రజల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు తగ్గించాలని  జగన్‌ డిమాండ్‌ చేశారని, ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యా యన్నారు.రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్‌ బాషా, ఉపసర్పంచ్‌ బొగ్గు భాస్కర్‌, తిమ్మరాయుడు, భూమిరెడ్డి,  వెంకట రమణారెడ్డి, రుద్రబాలకృష్ణ, శ్రీనివాసులు, నర్సింహు లు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


పెద్దమండ్యం: పట్టణంలోని పెట్రోల్‌ బంకు వద్ద  టీడీపీ మండల అధ్యక్షుడు సిద్దవరం ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పెట్రో ధరలు వెంటనే  తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గంగాధర, రామాంజులునాయుడు, సాంబశివ, కాలేషా, సయ్యద్‌ షావలీ, రెడ్డిహుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.   


నిమ్మనపల్లె: పట్టణంలోని ఎస్సార్‌ పెట్రోల్‌ బంకు వద్ద టీడీపీ నాయకులు నిరసనకు దిగారు.   కేంద్రం వ్యాట్‌ తగ్గిస్తే రాష్ట్రప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శి స్తోందన్నారు. చంద్ర, రామచంద్ర, శంకర, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST