నేడు తిరుపతిలో టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-20T07:08:45+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ముందుగానే పనబాక లక్ష్మిని అభ్యర్థి గా ప్రకటించి ప్రచార శంఖం పూరించిన తెలుగుదేశం పార్టీ.. ఆచరణ లోనూ అదే జోరు కనబరుస్తోంది.

నేడు తిరుపతిలో టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం
తిరుపతి చేరుకున్న అచ్చెన్నాయుడికి ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నేతల స్వాగతం

రేపు ధర్మపరిరక్షణ యాత్ర

రెండింటికీ హాజరు కానున్న అచ్చెన్నాయుడు


తిరుపతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ముందుగానే పనబాక లక్ష్మిని అభ్యర్థి గా ప్రకటించి ప్రచార శంఖం పూరించిన తెలుగుదేశం పార్టీ.. ఆచరణ లోనూ అదే జోరు కనబరుస్తోంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు నగరం లోని ఆటోనగర్‌ సమీ పంలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించను న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్‌, పులివర్తి నాని, రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి తదితరుల తోపాటు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా గూడూరులో పనబాక లక్ష్మి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ఈ శుభకార్యం వల్ల కార్యాలయ ప్రారంభోత్సవానికి పనబాక హాజరు కావడం లేదు. కాగా, బుధవారం రాత్రికి అచ్చెన్నాయుడు తిరుమల చేరుకుని, గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయాలపై దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతింటుండడం పట్ల తిరుపతిలో టీడీపీ చేపట్టే ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొంటారు. అలిపిరి కూడలి నుంచి ఎన్టీఆర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ బహిరంగసభ చేపట్టాలని నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మితో పాటు తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల పార్టీ నేతలు, క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు. కాగా, ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని, బహిరంగసభకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని పార్టీవర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - 2021-01-20T07:08:45+05:30 IST