ఎస్వీయూ దూరవిద్యా విభాగం డైరెక్టర్‌గా తవమణి

ABN , First Publish Date - 2021-11-02T07:12:23+05:30 IST

ఎస్వీయూనివర్సిటీ దూరవిద్యా విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ తవమణి నియమితులయ్యారు.

ఎస్వీయూ దూరవిద్యా విభాగం డైరెక్టర్‌గా తవమణి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 1: ఎస్వీయూనివర్సిటీ దూరవిద్యా విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ తవమణి నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్‌ రాజారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ సుబ్బారెడ్డి పదవీ విరమణ పొందడంతో ఈమెను నియమించారు. బోటనీ విభాగానికి చెందిన తవమణి, గతంలో ఒక సారి దూరవిద్యా విభాగం డైరెక్టర్‌గా పని చేశారు. 

Updated Date - 2021-11-02T07:12:23+05:30 IST