ముక్కంటి సేవలో తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-10-19T05:30:00+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుడిని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎంజే సుబ్రమణియన్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు.

ముక్కంటి సేవలో తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి
ముక్కంటి ఆలయంలో జడ్జి సుబ్రమణియన్‌ ప్రసాద్‌

శ్రీకాళహస్తి, అక్టోబరు 19: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎంజే సుబ్రమణియన్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జికి ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ముక్కంటి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST