ఎన్‌పీటీఈఎల్‌లో మిట్స్‌ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-26T05:50:41+05:30 IST

అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నికల్‌ ఎన్హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) ఆన్‌లైన్‌ పరీక్షలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ యువరాజ్‌ తెలిపారు.

ఎన్‌పీటీఈఎల్‌లో మిట్స్‌ విద్యార్థుల ప్రతిభ
ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ యువరాజ్‌

కురబలకోట, డిసెంబరు 25:  అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నికల్‌ ఎన్హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) ఆన్‌లైన్‌ పరీక్షలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ యువరాజ్‌ తెలిపారు.  కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాలకు చెందిన 20 విద్యార్థులు సాఫ్ట్‌ స్కిల్స్‌లో జాతీయస్థాయిలో టాపర్లుగా నిలిచారన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్‌ ఎన్‌.విజయభాస్కర్‌ చౌదరి,  కోఆర్డినేటర్‌ అరుళ్‌కుమార్‌, ట్రైనర్‌ అశ్విని అభినందించారు.

Updated Date - 2021-12-26T05:50:41+05:30 IST