జాతీయస్థాయి రోప్‌స్కిప్పింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-28T06:00:46+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈనెల 20 నుంచి 22వ తేదీవరకు జరిగిన జాతీయస్థాయి రోప్‌స్కిప్పింగ్‌ పోటీల్లో మదనపల్లె జడ్పీహైస్కూల్‌కు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

జాతీయస్థాయి రోప్‌స్కిప్పింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

మదనపల్లె క్రైం, డిసెంబరు 27: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈనెల 20 నుంచి 22వ తేదీవరకు జరిగిన జాతీయస్థాయి రోప్‌స్కిప్పింగ్‌ పోటీల్లో మదనపల్లె జడ్పీహైస్కూల్‌కు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఇందులోభాగంగా పాఠశాలకు చెందిన రెడ్డిమనోజ్ఞ, మానస, వీరోనిక, అఖిల్‌నాయుడు, రీహాన్‌, తరుణ్‌, యశశ్విని, బెహ్మిన్‌జైనా, కీర్తన, అఖిల్‌లు ప్రతిభ కనబరిచి 9 సిల్వర్‌, ఒక కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో విద్యార్థులను సోమవారం పాఠశాల హెచ్‌ఎం రెడ్డెన్నశెట్టి, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహ్మద్‌ఖాన్‌, చంద్రశేఖర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-28T06:00:46+05:30 IST