తెలుగు మాధ్యమంలో పీలేరు యువకుడి ప్రతిభ

ABN , First Publish Date - 2021-05-03T05:06:47+05:30 IST

పీలేరు పట్టణం కామాటంపల్లెకి చెందిన గల్లా వెంకటేష్‌ తెలుగు మాధ్యమంలో ప్రతిభను ప్రదర్శించి ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్‌గా నియమితులయ్యారు.

తెలుగు మాధ్యమంలో పీలేరు యువకుడి ప్రతిభ
జూనియర్‌ లెక్చరర్‌ గల్లా వెంకటేష్‌

జూనియర్‌ లెక్చరర్‌గా నియామకం 

పీలేరు, మే2: పీలేరు పట్టణం కామాటంపల్లెకి చెందిన గల్లా వెంకటేష్‌ తెలుగు మాధ్యమంలో ప్రతిభను ప్రదర్శించి ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల నిర్వహించిన జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకును, జోన్‌ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. వెంకటేష్‌ను  బి. కొత్తకోట కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా నియమిస్తూ ఇంటర్మీయడ్‌ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థి లెక్చరర్‌గా నియామకం కావడం పట్ల సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి. శ్రీరాములు, వైస్‌ ప్రిన్సిపాల్‌ నారాయణస్వామి, తెలుగు లెక్చరర్‌ శ్రీనివాసులురెడ్డి అభినందించారు. 
Updated Date - 2021-05-03T05:06:47+05:30 IST