కేసుల పరిష్కారానికి చొరవ చూపండి: ఏడీజే

ABN , First Publish Date - 2021-08-27T06:16:47+05:30 IST

కేసుల పరిష్కారానికి పోలీసులు చొరవ చూపాలని ఏడీజే పార్థసారఽథి పేర్కొన్నారు. గురువారం స్థానిక కోర్టులో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే మాట్లాడుతూ... సెప్టెంబరు 11న మదనపల్లె కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కేసుల పరిష్కారానికి చొరవ చూపండి: ఏడీజే
పోలీసులకు సూచనలిస్తున్న ఏడీజే పార్థసారథి

మదనపల్లె క్రైం, ఆగస్టు 26: కేసుల పరిష్కారానికి పోలీసులు చొరవ చూపాలని ఏడీజే పార్థసారఽథి పేర్కొన్నారు. గురువారం స్థానిక కోర్టులో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే మాట్లాడుతూ... సెప్టెంబరు 11న మదనపల్లె కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజీకుదిరే అన్నిరకాల కేసులను పరిష్కరించుకోవడంపై కక్షిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా కేసుల రాజీకి వారిని ఒప్పించాల న్నారు. దీంతోపాటు కేసుల పరిష్కారంలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు.  డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐలు ఈదురుబాషా, నరసింహులు, శ్రీనివాసులు, అశోక్‌కుమార్‌తో పాటు ఎస్‌ఐలు, కోర్టుసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:16:47+05:30 IST