అవెన్యూ ప్లాంటేషన్‌నుముమ్మరంగా చేపట్టండి
ABN , First Publish Date - 2021-07-24T05:50:01+05:30 IST
వెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని గ్రామీణ ఉపాధి హామీ పఽథక రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య ఆదేశించారు.

ఉపాధి హామీ పఽథక రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య
ములకలచెరువు, జులై 23: అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని గ్రామీణ ఉపాధి హామీ పఽథక రాష్ట్ర డైరెక్టర్ చిన్నతాతయ్య ఆదేశించారు. ములకలచెరువు మండలంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారి నుంచి దేవళచెరువు పంచాయతీ మావిళ్లవారి పల్లె వరకు రోడ్డు కిరువైపులా నాటిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పనులను నా ణ్యంగా చేపట్టాలన్నారు. అనంతరం కూలీలతో మాట్లా డారు. ఆయన వెంట డ్వామా ఏపీడీ మధుబాబు, ఎంపీ డీవో రమేష్‌బాబు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిలీల తదితరులు ఉన్నారు.