ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-01T05:16:59+05:30 IST

ఓటీఎస్‌ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు.

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

ఏర్పేడు, డిసెంబరు 31: ఓటీఎస్‌ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని గుడిమల్లం సచివాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ప్రసంగిస్తూ.. ఓటీఎస్‌తో లబ్ధిదారులు తమ ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చని సూచించారు. తక్కువ ఖర్చుతోనే సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని చెప్పారు. పక్కాగృహాల నిర్మాణ సమయంలో సకాలంలో బిల్లులు మంజూరవుతాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో తహసీల్దారు ఉదయ్‌సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T05:16:59+05:30 IST