సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతుల పరిశీలన
ABN , First Publish Date - 2021-05-21T06:08:39+05:30 IST
పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతు పనులను గురువారం చిత్తూరు ఆర్డీవో రేణుక పరిశీలించారు.

పుత్తూరు, మే20 : పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతు పనులను గురువారం చిత్తూరు ఆర్డీవో రేణుక పరిశీలించారు. ప్రమాద స్థాయిని తప్పించి పనులను బుధవారం నాటికి పూర్తి చేసినా ఇంకా లోటుపాట్లను గమనించి ప్రమాదం తలెత్తకుండా పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. కట్ట ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మరమ్మతులు చేసిన కారణంగా పట్టణ ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అకాల వర్షం కారణంగా వేసిన మట్టి దిగజారిపోతున్న కారణంగా మళ్ళీ మట్టి వేసి పనులను చేస్తున్నట్లు డీఈ సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోతో పాటు పుత్తూరు తహసీల్దార్ రవికుమార్, తదితరులు ఆమె వెంట ఉన్నారు.