రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాలకూ తాగునీరు

ABN , First Publish Date - 2021-07-13T05:20:38+05:30 IST

రాబోయే రెండేళ్లలో పీలేరు నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు తాగునీటి కొరత లేకుండా సరఫరా చేస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హామీఇచ్చారు.

రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాలకూ తాగునీరు
మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి

కలికిరి, జూలై 12: రాబోయే రెండేళ్లలో పీలేరు నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు తాగునీటి కొరత లేకుండా సరఫరా చేస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హామీఇచ్చారు. జలజీవన్‌ మిషన్‌ పథకం కింద గ్రామాల్లో కొళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. కలికిరి మార్కెట్‌ కమిటీకి ఏర్పాటైన  కొత్త పాలకవర్గాన్ని అభినందించడం కోసం సోమవారం స్థానిక మార్కెట్‌ యార్డులో ఏర్పాటయిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలికిరి ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం రూ.8 కోట్లతో భవనాలు మంజూరయినట్లు చెప్పారు. ఎల్లుట్ల వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయరుకు గండికోట నుంచి నీటిని తరలిస్తా మన్నారు.  ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రైతుల సమ స్యలను పరిష్కరించి గిట్టుబాటు ధరలు పొందేలా మార్కెట్‌ కమిటీని నిర్వ హించాలని కోరారు. మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ నల్లారి తిమ్మారెడ్డి మాట్లా డుతూ యార్డులో టమోట రైతులు మోసాలకు గురవుతూ నష్టపోతు న్నారని కొత్త పాలకవర్గం రైతులకు న్యాయం చేసేలా కృషిచేయాలని చెప్పా రు. యార్డును పరిశుభ్రంగా ఉంచడానికి  పంచాయతీ సహకరి స్తుందని సర్పంచ్‌ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయం చేస్తామని మార్కెట్‌ కమిటీ నూతన అధ్యక్షుడు రవికుమార్‌ రెడ్డి పాలకవర్గం తరపున హామీ ఇచ్చారు. అనంతరం కొత్త పాలకవర్గాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు సన్మానించారు. ఈ సమావేశంలో కలకడ మాజీ ఎంపీపీ వంగిమళ్ల మధుసూదన రెడ్డి, కలికిరి సర్పంచ్‌ ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు నల్లారి శ్రీకర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.  


సొసైటీ అధ్యక్షుడు శ్రీకర్‌ రెడ్డికి ఎంపీ అభినందనలు

రైతులకు విరివిగా రుణాలు అందజేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయడానికి పూర్తి సహకారాలు అందజేస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి హామీ ఇచ్చారు. సోమ వారం కలికిరి సింగిల్‌ విండో సొసైటీ కార్యాలయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి ఎమ్మెల్యే చింతలతో కలిసి సందర్శించారు. సింగిల్‌ విండో నూతన అధ్యక్షుడు నల్లారి శ్రీకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు కలికిరి పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. సర్పంచుగా ఎన్నికైన ప్రతాప్‌కుమార్‌ రెడ్డిని అభినందించారు.  వైసీపీ నాయకులు హరీష్‌రెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, మద్దిరాళ్ల మల్లికార్జున, ఎంపీడీవో వెంకటేశులు, సీఈవో కొండప్ప,  కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:20:38+05:30 IST