రబీ సీజన్‌కు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం

ABN , First Publish Date - 2021-11-02T05:47:46+05:30 IST

రబీ సీజన్‌లో వేరుశనగ సబ్సిడీ విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తూర్పు మండలాల్లో రబీలో వేరుశనగ అధికంగా సాగు చేయనున్న నేపథ్యంలో అధికారులు సింహభాగం సదరు మండలాలకు విత్తనకాయలు కేటాయించారు.

రబీ సీజన్‌కు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం

13,500 క్వింటాళ్ల వేరుశనగ


 కిలో రూ.53.40


మదనపల్లె టౌన్‌, నవంబరు 1: రబీ సీజన్‌లో వేరుశనగ సబ్సిడీ విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తూర్పు మండలాల్లో రబీలో వేరుశనగ అధికంగా సాగు చేయనున్న నేపథ్యంలో అధికారులు సింహభాగం సదరు మండలాలకు విత్తనకాయలు కేటాయించారు. జిల్లాలో మొత్తం 34 మండలాల్లో రబీ సీజన్‌లో 13,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో సత్యవేడు, నగరి, చంద్రగిరి, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు అఽధికంగా విత్తనాలను కేటాయించారు. వేరుశనగ కిలో ధర రూ.89 ఉండగా అందులో ప్రభుత్వ 40శాతం సబ్సిడీ రూ. 35.60 పోను రైతు 53.40 చెల్లించాల్సి వుంది. కాగా అధికంగా కే-6 రకంతో పాటు, నారాయణి, కదిరి రకం విత్తనాలను అధికారులు పంపిణీ చేయనున్నారు. ఈనెల 7వ తేది లోగా  ఆర్‌బీకేల్లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, 5వ తేది నుంచి విత్తన పంపిణీ కార్యాక్రమం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


Updated Date - 2021-11-02T05:47:46+05:30 IST