సబ్‌జైలులో టీడీపీ నాయకులకు కిశోర్, చల్లా పరామర్శ
ABN , First Publish Date - 2021-12-31T06:32:04+05:30 IST
పీలేరు సబ్‌జైలులో ఉన్న కేవీపల్లె మండల టీడీపీ నాయకులను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డిలు గురువారం పరామర్శించారు.

పీలేరు, డిసెంబరు 30: పీలేరు సబ్‌జైలులో ఉన్న కేవీపల్లె మండల టీడీపీ నాయకులను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డిలు గురువారం పరామర్శించారు. కేవీపల్లె మండలం గర్నిమిట్ట చేపలచెరువు వేలం పాటల సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి టీడీపీకి చెందిన చరణ్, ప్రార్ధసారథి (ధనుంజయనాయుడు), సాయిమహేష్, రెడ్డిప్రసాద్, దినేష్, లోకేశ్‌లను కేవీపల్లె పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం పీలేరు సబ్‌జైలుకు తరలించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న నల్లారి కిశోర్, చల్లా రామచంద్రారెడ్డి సబ్‌జైలుకు చేరుకుని వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు, కేవీపల్లె మండల టీడీపీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉండి ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబురెడ్డి, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వారణాశి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రెడ్డిబాషా, నాయకులు స్పోర్ట్స్ మల్లి, పురం రామ్మూర్తి, ఎన్. అమరనాథరెడ్డి, శ్రీనాధరెడ్డి, గీతమ్మ, సతీష్‌రెడ్డి, రాజ, లక్ష్మీకర్, రియాజ్, సుబ్బయ్య, షౌకత్‌అలీ, సుభాష్, సురేష్, వెంకటేశ్వర నాయుడు, రవికుమార్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.