ఎస్వీయూ పరీక్షల విభాగ ప్రత్యేక సలహాదారుగా సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-11-23T08:11:47+05:30 IST

ఎస్వీయూనివర్సిటీ పరీక్షలు, దూరవిద్య విభాగాల ప్రత్యేక సలహాదారుగా ప్రొఫెసర్‌ ఎస్వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు.

ఎస్వీయూ పరీక్షల విభాగ ప్రత్యేక సలహాదారుగా సుబ్బారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 22: ఎస్వీయూనివర్సిటీ పరీక్షలు, దూరవిద్య విభాగాల ప్రత్యేక సలహాదారుగా ప్రొఫెసర్‌ ఎస్వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి బాధ్యతలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వీసీ రాజారెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ సోమవారం జారీ చేశారు. దూరవిద్య విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తూ.. సుబ్బారెడ్డి గత నెలలో పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు.

Updated Date - 2021-11-23T08:11:47+05:30 IST