పోటీతత్వంతో పనిచేస్తేనే సహకార సంఘాల బలోపేతం

ABN , First Publish Date - 2021-12-28T05:57:08+05:30 IST

పోటీతత్వంతో పనిచేస్తేనే సహకార సంఘాలు బలోపేతమవుతాయని కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ జిల్లా మేనేజర్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

పోటీతత్వంతో పనిచేస్తేనే సహకార సంఘాల బలోపేతం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా మేనేజరు ప్రసాద్‌

తొట్టంబేడు, డిసెంబరు 27: పోటీతత్వంతో పనిచేస్తేనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బలోపేతమవుతాయని కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ జిల్లా మేనేజర్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని తంగేళ్లపాళెం సింగిల్‌ విండో కార్యాలయ ఆవరణలో ఆయన సింగిల్‌విండోల సీఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ... సొసైటీలు అభివృద్ధి చెందడంలో ఉద్యోగులు పోటీపడి పనిచేయాలని సూచించారు. సింగిల్‌విండోల పనితీరుపై రైతులు అపోహలు వీడాలంటే జాతీయ బ్యాంకులకు ధీటుగా సేవలందించాల్సి ఉందన్నారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్‌ మోహన్‌ కిశోర్‌ నాయుడు, డైరెక్టర్లు భక్తవత్సలం, ప్రభాకర్‌, సూపర్‌వైజర్లు మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T05:57:08+05:30 IST