చిత్తూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T06:30:35+05:30 IST

చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది.

చిత్తూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవం
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 1: చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది.  జాతీయ జెండాను జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ సెంథిల్‌కుమార్‌,  మేయర్‌ అముద, జేసీ రాజశేఖర్‌, డీఆర్వో మురళి, ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల  విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2021-11-02T06:30:35+05:30 IST