పోలీసుల చొరవ

ABN , First Publish Date - 2021-08-25T05:34:36+05:30 IST

శ్రీకాళహస్తి పట్టణ బైపాస్‌ వంతెనపై ఏర్పడిన గుంతలను పోలీసులు పూడ్చి ఆదర్శంగా నిలిచారు.

పోలీసుల చొరవ
వంతెనపై ఏర్పడిన గుంతలు పూడ్చుతున్న పోలీసులు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 24: ప్రమాదాల అడ్డుకట్టకు శ్రీకాళహస్తి పోలీసులు చొరవ చూపుతున్నారు. మంగళవారం పట్టణ బైపాస్‌ వంతెనపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ పనులకు సహకరించిన నవభారత్‌ యువజన సంఘం సభ్యుడు గరికపాటి రమే్‌షబాబు మాట్లాడుతూ వంతెన నిర్మాణం జరిగి ఏళ్లవుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. దీంతో పెద్దగుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో హైవే పెట్రోలింగ్‌, రక్షక్‌ సిబ్బంది రవి, గోపాల్‌రాజు, ప్రసాద్‌, మునస్వామి, కన్నయ్య, నవభారత్‌ యువజన సంఘ సభ్యులు ఢిల్లీకుమార్‌, మురళి, వాసుయాదవ్‌, గురుస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T05:34:36+05:30 IST