మద్యం పట్టివేతలో గోప్యతపై ఎస్పీ సీరియస్‌

ABN , First Publish Date - 2021-12-27T04:34:52+05:30 IST

చిత్తూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుని గోప్యంగా ఉంచడంపై ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. నిందితులను ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదని పోలీసు అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. శు

మద్యం పట్టివేతలో గోప్యతపై ఎస్పీ సీరియస్‌

చిత్తూరు, డిసెంబరు 26: చిత్తూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుని గోప్యంగా ఉంచడంపై ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. నిందితులను ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదని పోలీసు అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం కర్ణాటక నుంచి చిత్తూరుకు తీసుకొస్తున్న అక్రమ మద్యాన్ని తాలూకా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 15 మందిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నారు. పట్టుబడిన మద్యంతో పాటు 15 కిలోల గంజాయి కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ అక్రమ రవాణాలో కొంగారెడ్డిపల్లెకు చెందిన స్మగ్లర్‌తో పాటు మరికొంత మంది ఉన్నట్లు సమాచారం. ఎస్పీ సీరియస్‌ అయిన నేపథ్యంలో అక్రమ మద్యం, గంజాయికి సంబంఽధించిన నిందితులను నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2021-12-27T04:34:52+05:30 IST